ప్రతిఘటన, జోగులాంబ గద్వాల రిపోర్టర్ గడ్డం సుధాకర్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ అంకెల గారడి అరచేతిలో వైకుంఠం చూపినట్లు ఉందని కేటి దొడ్డి మండలం బీఆర్ఎస్ నాయకులు గాజుల కృష్ణారెడ్డి, నక్క రవి, ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త సీసాలో పాత సార పోసినట్లు అన్ని వర్గాలను దగా, నయవంచన చేసిన బడ్డెట్ అన్నారు ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిట్టి, అగ్రవర్ణ పేదలను ఈ బడ్జెట్ నట్టేట ముంచిన మండిపడ్డారు. కేసీఆర్ ఎప్పుడో తప్పిదారి కాంగ్రెస్ ఓటు వేస్తే రైతుబంధుకు రామ్.. రామ్, దళిత బందుకు జై భీమ్ అని కేసీఆర్ చెప్పాడని గుర్తు చేశారు. ఆ మాటలను రేవంత్ సర్కార్ నిజం చేస్తుందన్నారు. కౌలు రైతుల ఊసు లేదు, అటో వాళ్లకు, ఆర్టీసి కార్మికులకు అన్యాయం జరిగిందని, మహిళలకు, విద్యార్థిలకు అవమానం జరిగిందని, ఉద్యోగులకు, నిరుద్యోగులకు దగా జరిగిందని అన్నారు. కానీ కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ కు ఓటు వేస్తే మోస పోతరు, గోసపడుతరు.. అన్న మాటలు నిజమవుతున్నాయని పేర్కొన్నారు.
