ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్ఈ నెల 26న నాగర్ కర్నూలు లో ఉచిత కంటి ఆపరేషన్ చికిత్స శిబిరం

ఈ నెల 26న నాగర్ కర్నూలు లో ఉచిత కంటి ఆపరేషన్ చికిత్స శిబిరం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈనెల 26న గురువారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరము నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూలు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో గది నెంబర్ 102లో కంటి శిబిరం ఉదయం 9 నుండి 12 గంటల వరకు వచ్చిన రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ పరీక్షలు నిర్వహించి, అందులో అవసరమైన వారికి, క్యాటరాక్టు పొర గలవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు మహబూబ్ నగర్ ఏనుగొండ లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రోగులకు ప్రత్యేక అంబులెన్స్ ద్వార ఏనుగొండకు పంపనున్నట్లు తెలిపారు. రోగులు ముందుగా బీ.పీ, షుగర్ పరీక్షలు చేసుక్కొని రిపోర్టు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఈ ప్రాంత రోగులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఏదేని గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్ ని తమ వెంట తెచ్చు కోవాలని తెలిపారు. వివరాలకు 9440876556, 7386940480 లో సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!