ప్రతి ఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి. కురుమయ్య ను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎమ్మార్సీ భవనంలో శాలువాలతో శనివారం ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ పాఠశాల గుడిపల్లి ప్రధాన ఉపాధ్యాయులు గా ఉన్న కుర్మయ్య రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ నాగర్ కర్నూలు మండల విద్యాధికారిగా నియమించింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రమేష్ కార్యదర్శి డి.ప్రభాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మురళి అసోసియేట్ ప్రెసిడెంట్ కరుణాకర్, ఎస్. ఈశ్వర్, నరసింహ, నారాయణ, బాలస్వామి, మధుసూదన్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
