ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
పాఠశాల దశలోనే నైతిక పునాదులు బలంగా పడితే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తయారవుతారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గల బడంగ్ పేట్ డివిజన్ లో ది మాస్టర్ మైండ్ స్కూల్ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ.. విద్యా సంస్థలు అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే గాక ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. పాఠశాల దశలోనే నైతిక పునాదులు బలంగా పడితే, భవిష్యత్తులో వారు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల దశలోనే బలమైన పునాదులు వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. నైతిక విలువల పెంపు, డిజిటల్ బోధన , శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను భావి నాయకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, చైర్మన్ రాజు, పాఠశాల సిబ్బంది, గొంగడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
