ePaper
Saturday, June 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన,నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

బిజినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. బిజినాపల్లి లూర్దునగర్ అనాధ శరణాలయంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనాధాశ్రమంలో ఉన్న వృద్ధులు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అందరూ దీవించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మరో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగినదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ పులేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సీర్నం బాలస్వామి, గ్రామ అధ్యక్షుడు కృష్ణయ్య, జగదీశ్వర్ రెడ్డి, మంగనూరు తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ బోట్కా చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ వట్టెం తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, గట్టు మహాదేవుని పేట్ సర్పంచ్ ఆంజనేయులు, పాలెం సర్పంచ్ రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు ఖదీర్, మైనార్టీ నాయకులు ఎండి గపూర్, జగదీష్, రఘుమా రెడ్డి, ఊషన్న, మంగి మురళి, కంపిల్ల పర్వతాలు, రమణ గౌడ్, శంకర్ గౌడ్, వెంకట్ రెడ్డి, ఆరీఫ్, రిజ్వాన్, హరీష్ బాబు మాజీ సర్పంచ్ లు రాము నాయక్, బోనాసి లక్ష్మయ్య, అబ్బ రాములు, మూడవత్ రాము, శ్రీశైలం రెడ్డి, భీమయ్య తదితరులు పాల్గొనడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!