ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
తెలంగాణ సాధకుడు, దార్శనికుడిగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని బడంగ్పేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి ప్రశంసించారు. బడంగ్పేట్ పాత మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 150 మంది రక్తదానం చేశారు. అదే విధంగా దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ చేశారు. మాజీ కెసిఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసిఆర్ అని, కెసిఆర్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండేవారని, వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు 2000 ఆసరా పెన్షన్ రైతుబంధు రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రియంబర్స్మెంట్, కేసిఆర్ కిట్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగు త్రాగునీటి ప్రాజెక్టులు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్, ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోనున్నారని తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
