ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవిద్యార్థుల భవిష్యత్తుతో ట్రాఫిక్ పోలీసుల చెలగాటం

విద్యార్థుల భవిష్యత్తుతో ట్రాఫిక్ పోలీసుల చెలగాటం

📰 Generate e-Paper Clip

హడావిడిగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు

ట్రాఫిక్ చాలాన్ల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కట్లు

పరీక్షల వేల విద్యార్థుల తల్లిదండ్రులకు ట్రాఫిక్ పోలీసులు సహకరించకుండ వేధింపులు

పరీక్ష కేంద్రం వద్ద తల్లిదండ్రుల బండ్లు ఆపి మరీ చలాన్లు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు

ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ ఆగ్రహం

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పదవ తరగతికి పరీక్షలు ప్రారంభమై విద్యార్థులంతా తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి అని హడావిడిగా పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలిస్తుండగా, మరి కొంత మంది విద్యార్థులు తమ వాహనాలపై పరీక్ష కేంద్రాలకు బయలుదేరుతున్నారు. అయితే ఎల్బీనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులను అడ్డగించి ట్రాఫిక్ చాలన్ల పేరుతో వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద తల్లిదండ్రులు నిలిపిన వాహనాలకు చాలాన్లు వేస్తూ పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తూ తాము ప్రభుత్వానికి ఏదో వెలగబెడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఆక్రమణలు ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టించుకోని పోలీసులు విద్యార్థులు టార్గెట్ చేయడం పట్ల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు సహకరించాలి

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు ప్రారంభవం సందర్బంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు సేవ భావంతో తమ వంతుగా సహకరించాలి. పరీక్ష కేంద్రాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులు బండి లిఫ్ట్ అడిగిన ఏదైనా వస్తువు మరిచిపోయిన వాహనదారులు విద్యార్థులకు సహాయం చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను ఐదు నిముషాలు ఆలస్యం అయినా అనుమతించాలని చెప్పినదని ఆదిశగా నిర్లక్ష్యం చేయరాదని గుర్తు చేశారు. పరీక్ష కేంద్రాలకు తమ పిల్లలను దూర ప్రాంతo నుండి తీసుక వచ్చే విద్యార్థుల ప్రయాణo దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలి. కాని కొందరు ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులను బండి ఆఫి ఆర్ సి, లైసెన్స్, హెల్త్మేట్ ఇన్సూరెన్స్ ఉన్నదా.. అంటూ పోలీసులు నడిరోడ్డు పైనే బండి ఆపి చాలాన్లు రాస్తు ఇబ్బందులకు గురించేస్తున్నారని తల్లిదండ్రులు తెలంగాణ రాజ్యాధికారం పార్టీ హెల్ప్ లైన్ కీ ఫోన్ ఫోన్ చేస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి ట్రాఫిక్ పోలీసులు బండి ఫోటోలు తీసి చలాన్లు ఇంటికి పంపిస్తున్నారని అంటున్నారు. మేము మా పిల్లలు పరీక్షలు ఎలా రాస్తున్నారో అని ఒక వైపు ఆలోచన చేస్తుంటే పరీక్ష కేంద్రం దగ్గర ఉన్న బండ్ల వద్దకి వచ్చి చలాన్లు రాస్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కి అర్హత లేకున్నా ఫోటోలు తీసి తమ అధికారుల మెప్పుకోసం ప్రభుత్వం ఖజానా నింపడం కోసం ట్రాఫిక్ పోలీసులు చలాన్ల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలపై వెంటనే స్పందించాలి. పరీక్షలు రాసే విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి.

బొంగు వెంకటేష్ గౌడ్
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!