ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్వర్కింగ్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

వర్కింగ్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

జర్నలిస్టులను అవమానించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గం టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ అధ్యక్షుడు తడక నర్సింహా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ జర్నలిస్ట్ సమాజాన్ని అవమానించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ జర్నలిస్ట్ సమాజాన్ని అవమానించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 44 వేలకు పైగా అక్రిడిషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ కేవలం ఎంపానల్మెంట్ కలిగిన కొన్ని పత్రికలకు, ఛానళ్లకు మాత్రమే ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయా పత్రికల సర్కులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన అనేక పత్రికలకు ఇంపానల్మెంట్ చేయకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ సరైన న్యాయం చేస్తామని నమ్మబలికిన పాలకులు మీడియా అక్రిడిటేషన్ విషయంలో వివక్ష చూపుతూ చిన్న, మధ్య తరహా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న పత్రికలకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!