ePaper
Monday, April 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణమంత్రి గారూ.. సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా..? - వై.సతీష్ రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్

మంత్రి గారూ.. సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా..? – వై.సతీష్ రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్

📰 Generate e-Paper Clip

మేం ఆధారాలతోనే కొడతాం

మాకు చెప్పులు అవసరం లేదు..

మంత్రి స్థాయిలో ఉండి సీతక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు..

మేం మంత్రిలా అబద్ధాలు చెప్పం..

ఏదైనా ఆధారాలు.. వాస్తవాలతోనే సమాధానాలు చెబుతాం

సీతక్కకు కౌంటర్ ఇచ్చిన రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి

మంత్రి సీతక్క వ్యవహారం ఉల్టా.. చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉంది. అంగన్వాడీల కోసం మొబైల్ ఫోన్ల కొనుగోలులో స్కాం చేసి అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు వార్నింగ్ లు ఇస్తున్నారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ప్రతీ సారి విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ.. ఇష్టారీతిగా మాట్లాడే సీతక్క.. మొదట ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సాక్షాత్తు కేంద్రప్రభుత్వమే 5G ఫోన్లు ఇవ్వాలని చెప్పింది. అయినా కూడా ఎందుకు 4G ఫోన్లు ఇచ్చారు.? అంతేకాదు.. పొరుగునే ఉన్న ఏపీతో పాటు.. గుజరాత్, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల్లో 5G ఫోన్లు ఇచ్చారు.. సీతక్క మాత్రం 4G ఫోన్లు ఇచ్చారు. పైగా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే డబ్బులు మిగిల్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. 4G ఫోన్లు ఇప్పుడు ఔట్ డేట్ అయ్యాయి. అలాంటి ఫోన్లను రూ.11,600 కొన్నామని సీతక్క చెబుతున్నారు. కానీ మార్కెట్ లో రిటైల్ లో కొంటేనే శాంసంగ్ A 06 -5G ఫోన్ ధర రూ.9,899 రూపాయలు ఉంది. అది కూడా బల్క్ లో తీసుకుంటే ఒక్కో ఫోన్ మీద మూడు నాలుగు వేలు తగ్గే అవకాశం ఉంది. మరి సీతక్క గారు 4G ఫోన్ కు రూ.11,600 ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 5 G ఫోన్లు ఇవ్వాలని చెప్పినా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు 4 G ఫోన్లకు టెండర్ పిలిచింది. కాబట్టి అంగన్వాడీల కోసం మొబైల్ ఫోన్ల కొనుగోలులో నూటికి నూరు శాతం స్కాం జరిగింది. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టే సరికి సీతక్క ఫ్రస్టేషన్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగానే ఏ తప్పూ చేయకపోతే.. దీనిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. మంత్రి సీతక్క స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి సీబీఐ ఎంక్వైరీ కోసం సిఫారసు లేఖ పంపించాలి. ఔట్ డేటెడ్ ఫోన్లను అడ్డగోలు రేట్లకు కొన్నామని అబద్ధాలు చెప్పడమే కాకుండా.. ఎదురుదాడి చేసి తప్పించుకుందామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు సీతక్క గారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

బీజేపీ- కాంగ్రెస్ మిలాఖాత్.!

రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ మిలాఖాత్ అయ్యాయని మొబైల్ ఫోన్ల స్కాం ద్వారా మరోసారి స్పష్టమైంది. ఫోన్లు కొనాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే.. రేవంత్ సర్కారు అందులో స్కాం చేసింది. అయినా కూడా ఇప్పటి వరకు దీనిపై ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. గతంలో అయిన దానికి.. కాని దానికి చెంగు చెంగున ఎగిరిన బీజేపీ ఎంపీలు,ప్రస్తుత కేంద్రమంత్రులు ఎందుకు గప్ చుప్ అయిపోయారో కూడా బయటపెట్టాలి. నిజంగానే ఈ స్కాంతో బీజేపీకి సంబంధం లేకపోతే సీబీఐ ఎంక్వైరీ ఆదేశించాలి. కేంద్ర ప్రభుత్వ నిధులు మింగేసిన మంత్రి.. సహకరించిన ముఖ్యమంత్రి.. ఆ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే.. కాంగ్రెస్, బీజేపీ కలిసే ఈ స్కాం చేశారని భావించాల్సి వస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!