ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్భవన నిర్మాణ కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

భవన నిర్మాణ కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ముఖ్యఅతిథిగా హాజరైన కమతం యాదగిరి

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో ప్రతినిధి:

భవన నిర్మాణ కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లేబర్ అడ్డ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2026 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు చెట్టుకింది శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలోని లేబర్ అడ్డల వద్ద భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఎండలో నిలబడి రోజు కూలి పనుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అడ్డ వద్ద షెడ్డు ఏర్పాటు చేయడంతో పాటు త్రాగునీటి సౌకర్యం, వాష్‌ రూములు, విశ్రాంతి గదులు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ అడ్డా ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ కమిటీ సభ్యులు. సాగర్ సురేష్ రాజు వీరేశం కృష్ణయ్య కురుమయ్య, శీను, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!