ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్క్రీడలతో యువతకు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం క్రమశిక్షణ అలబడుతుంది

క్రీడలతో యువతకు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం క్రమశిక్షణ అలబడుతుంది

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

నేటి యువతకు క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ అలబడుతుందనీ టీపీసీసీ యేలిమేటి అమరేందర్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ పరిధిలోని వైఏస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో యేలిమేటి రామ్ రెడ్డి మెమోరియల్ ఓపెన్ బాడీ బిల్డింగ్ అండ్ మెన్ ఫిజిక్స్ ఛాంపియన్షిప్ మిస్టర్ తెలంగాణ ఐకాన్ క్లాసిక్ -3 2026 పోటీలను టీపీసీసీ సెక్రెటరీ యేలిమేటి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు దేవ భాస్కర్ రెడ్డి, బాలాపూర్ సీఐ సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేలిమేటి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడలతో యువతకు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి, క్రమశిక్షణకు ఉపయోగపడుతుందని, దీంతో వారు ఉన్నత మార్గదర్శకాలను చేరుకుంటారని కొనియాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, ఇలాంటి క్రీడల్లో రాణించి, ప్రోత్సహించాలని కోరారు. క్రీడలను ప్రోత్సహించడం ద్వారా తమకు ఎంతో ఆనందం చేకూరుతుందన్నారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన యేలిమేటి అమరేందర్ రెడ్డిని అభినందించారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేసి, ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో బండి మధుసూదన్ రావు, గోవర్ధన్ రెడ్డి, వంగేటి లక్ష్మ రెడ్డి, రఘునందన చారి, ఎర్ర జైహింద్, జంగయ్య, అహ్మద్ బామ్, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్, చలపతి రెడ్డి, భాను ప్రసాద్, రాజేష్ ఠాకూర్, ప్రభాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కృష్ణంరాజు గౌడ్, అరవింద్ గౌడ్, బాలరాజ్, బద్దం మల్లారెడ్డి, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!