ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeసినిమానా జీవితంలో ‘పునాదిరాళ్లు’ పడింది ఈ రోజే.. మెగాస్టార్ చిరంజీవి

నా జీవితంలో ‘పునాదిరాళ్లు’ పడింది ఈ రోజే.. మెగాస్టార్ చిరంజీవి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, సినిమా: తన అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది అభిమానులు, ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణంలోని అమూల్యమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’. ఈ సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు మెగాస్టార్. ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాదిరాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన మొదటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!