prathighatana.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 6:38 pm Digital Edition : PRATHI GHATANA

ఎడ్మ రాధికా రెడ్డికి అడుగడుగునా జన నీరాజనం

ప్రతిఘటన, కల్వకుర్తి : బీఆర్ఎస్ కల్వకుర్తి మున్సిపల్ 16వ వార్డ్ అభ్యర్థి ఎడ్మ రాధికా రెడ్డి అఖండ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం కల్వకుర్తి 16వ వార్డు అభ్యర్థి ఎడ్మ రాధికా రెడ్డి గజ్జల సుష్మ మధుసూదన్ రెడ్డి తో కలిసి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడ్మ రాధిక రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గజ్జల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి మున్సిపల్ 16వ వార్డ్ అభ్యర్థి ఎడ్మ రాధికా రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొంది మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రాధిక రెడ్డి గెలుపుతో కల్వకుర్తి మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎడ్మ కృష్ణారెడ్డి కుటుంబం నుంచి కల్వకుర్తి మున్సిపల్ అభ్యర్థిగా రాధికా రెడ్డి బరిలో నిలవడంతో స్థానిక ప్రజలు ఆమెకు నీరాజనం పడుతున్నారని తెలిపారు. అందుకు 90 శాతం ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు రావడమే నిదర్శనమని స్పష్టం చేశారు.