ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిశ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొన్న చిగురింత పారిజాత నర్సింహారెడ్డి

శ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొన్న చిగురింత పారిజాత నర్సింహారెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జీహెచ్ఎంసీ పరిధిలోని బాలాపూర్, బడంగ్ పేట్ డివిజన్ లలో జరిగిన శ్రీ సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి పాల్గొన్నారు. సాయినగర్ లో కాంగ్రెస్ నాయకుడు గిరి ముదిరాజ్ ఆయనను ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు.

ఈ సందర్భంగా చిగురింత నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఒకరి దగ్గర మరొకరు లేకున్నా నిరంతరం ఒకరినొకరు తలుచుకుంటూ జీవించారన్నారు. కష్టకాలంలో, సుఖాల్లోనూ ఒకేలా తోడూ నీడలా జీవించిన శ్రీ సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని గుర్తు చేస్తూ, వారిలాగా నూతన దంపతులు కలిసి జీవించాలని, ఎడ బాటులోనూ విడిపోకుండా మనసా.. వాచా.. కర్మణా ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకోవాలని రామాయణ ఇతిహాసం ప్రబోధిస్తుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!