ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జల్ పల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ కాలనీ ప్రభుత్వ స్కూల్లో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్నడు లేని విధంగా స్కూల్లో ముత్యాల పందిరి వేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కళ్యాణోత్సవం గతంలో ఎన్నడు లేని విధంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహించడంతో కాలనీవాసులు , భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కళ్యాణ ఉత్సవం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భక్తులకు వేసవిలో నీటి సమస్య లేకుండా కోటి విద్యాలయ విద్యార్థుల చేత వచ్చిన ప్రతి ఒక్కరికి చల్లని మంచినీటిని గ్లాసులలో అందించారు. పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీసీతా రాములను పల్లకిలో కూర్చున బెట్టి వీధుల గుండా తిప్పుతూ కళ్యాణ ప్రాంగణానికి తీసుకెళ్లారు. పల్లకి సేవ అందరిని ఆకట్టుకుంది. శ్రీసీతా రాముల కల్యాణాన్ని భక్తులు కళ్ళారా వీక్షించి పులకించిపోయారు. కాలనీలో పండుగ వాతావరణం ఏర్పడింది. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవాన్ని ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల సభ్యులు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ , ఎస్సై లక్ష్మయ్య , భక్తులు పాల్గొన్నారు.
