ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డివైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జల్ పల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ కాలనీలో  శ్రీసీతారామ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో శ్రీరామ కాలనీకి చెందిన బాలకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు కళ్యాణం అనంతరం అన్నదానం నిర్వహించారు. దీంతో శ్రీరామనవమి వేడుకలతో పండుగ సందడి వాతావరణం నెలకొన్నది. జల్ పల్లి గ్రామానికి 20 సంవత్సరాలుగా సర్పంచ్ గా సేవలందించిన మాజీ సర్పంచ్ కట్టెల రాములను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సీతారామ శ్రీ సీతారామస్వామి దేవాలయం చైర్మన్, మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్, గ్రామ పెద్దలు యువత దూడల సుధాకర్ గౌడ్, నాగభూషణం, సత్యనారాయణ, మారుతి, దేవా, విక్కీ, బాలరాజు, నితీష్ , శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!