ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జల్ పల్లి డివిజన్ మామిడిపల్లిలో శ్రీ సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతా రాముల కళ్యాణం ఎన్నడు లేని విధంగా గ్రామ నడిబొడ్డున ముత్యాల పందిరి వేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహించడంతో గ్రామ చుట్టుపక్కల ప్రజలు భక్తులు వచ్చి కళ్యాణోత్సవం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణాల మధ్య కళ్యాణోత్సవాన్ని ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు మద్ది జగదీశ్వర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, ఎడ్ల వాసుదేవరెడ్డి, పేరమోని నరేష్ యాదవ్, యాతం పవన్ కుమార్ యాదవ్, గుర్జని గణేష్, నందీశ్వర్, భక్తులు పాల్గొన్నారు.
