ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

కందుకూరు మండల పరిధిలోని లేమూర్ గ్రామం లో మార్చి 31 తేదీ నుండి ఏప్రిల్ 3 వరకు జరగబోయే శ్రీదేవి భూదేవి సమేత స్వయంబు శ్రీ వెంకటేశ్వర స్వామి మన్యంబావి దేవాలయ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిలుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిళ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ చరణ్ , ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రజావాణి ఇంచార్జి జిల్లెల చిన్నారెడ్డిని లేమూర్ గ్రామ మాజీ సర్పంచ్, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గూడూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించారు.

ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో శ్రీవారి కల్యాణం, వాహన సేవలు, రథోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అత్యంత వైభవంగా జరిగే ద్వితీయు బ్రహ్మోత్సవాలకు కందుకూరు, మహేశ్వరం మండలాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకావాలని కోరారు.

ఈ కార్యక్రమం లో మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ నాయకులు మహమ్మద్ రహీమ్,గూడూరు రవీందర్ రెడ్డి, మంచాల భాస్కర్, ఉదయ్ రెడ్డి, గుర్రం సత్తయ్య గంగరి దర్శన్, గుల్వి నర్సింహా, రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.
