ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ముందస్తు అరెస్టుల చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం

ముందస్తు అరెస్టుల చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం మండల యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, ఎన్ డి.తాండ మాజీ సర్పంచ్ మెగావత్ రాజు నాయక్ లను అడ్డుకొని అరెస్ట్ చేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!