ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు

రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు

📰 Generate e-Paper Clip

రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు

సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ప్రాధాన్యత

కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయం లో ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత గురించి సమావేశం జరిగింది. టి యు ఎఫ్ ఐ డి సి చైర్మన్ , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి , ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, బడంగ్ పేట్ , జల్ పల్లి డిప్యూటీ కమిషనర్లు సరస్వతి, వెంకట్ రామ్ , ఎల్బీనగర్, సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ రావు తో కలిసి ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులకు చేరేలా సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏప్రిల్ 2026 నుండి రెండో విడత ఇళ్ల కేటాయింపులు ప్రారంభం కానున్నాయన్నారు. ఇందులో భాగంగా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని అధికారులు పరిశీలించి పారదర్శకంగా మంజూరు చేస్తారన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!