ePaper
Wednesday, April 8, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఐక్యత సౌహార్దత సహనం సేవా భావానికి ప్రతీక రంజాన్

ఐక్యత సౌహార్దత సహనం సేవా భావానికి ప్రతీక రంజాన్

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ఐక్యత, సౌహార్దత, సహనం, సేవా భావానికి ప్రతీక రంజాన్ పండుగని కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పీసీసీ కార్యదర్శి అమరేందర్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ లోని వై ఏ ఆర్ కన్వెన్షన్ లో జల్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ బామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే పీసీసీ కార్యదర్శి ఎల్మేటి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సమాజంలో ఐక్యత, సౌహార్దత, సహనం, సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి సోదరభావంతో జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం అక్కడి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ బామ్ మహమ్మద్ ఖాద్రి , మమ్మద్ జహంగీర్ వలి, భాను, వంగేటి మధుసూదన్ రెడ్డి, రాజేష్ ఠాకూర్, ఆంజనేయులు, డివిజన్ కు సంబంధించిన ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!