ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల ఐక్యతకు మత సామరస్యానికి నిదర్శనం

ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల ఐక్యతకు మత సామరస్యానికి నిదర్శనం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల ఐక్యతకు, మతసామరస్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్ పల్లి బీఆర్ఎస్ నాయకుడు సయూద్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ఖర్జూర పండు తినిపించి ఉపవాసాన్ని విరవింప చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి, సోదరభావానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ విందుల్లో పాల్గొనడం, మతాల మధ్య ఐక్యతను పెంపొందించడం ద్వారా ఇఫ్తార్ విందులు ప్రత్యేకమైన సాంస్కృతిక వేదికలుగా మారుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి, పల్లపు శంకర్, కొంగర సుభాష్ కురుమ, యంజాల అర్జున్, మారుతి, కొంగర నిశాంత్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!