ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కందుకూరు సీనియర్ నాయకులు, మహేశ్వరం నియోజకవర్గం తెలంగాణ జాగృతి ఇన్ఛార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు కాంగ్రెస్ లో చేరారు. వారందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… కార్యకర్తల బలం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. పార్టీని వీడిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ లో చేరటం సంతోషమన్నారు. అందుగుల సత్యనారాయణ సహా మహిళలు, యువకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కిచ్చెన్నగారు హామీ ఇచ్చారు. పంచాయతీలు, పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ నాయకులకే పట్టం కట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లక్ష్మారెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ యాదయ్య, మాజీ కాంగ్రెస్ యూత్ నాయకుడు ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
