prathighatana.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 7:54 am Digital Edition : PRATHI GHATANA

సమాజానికి మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ నాగర్ దొడ్డి సర్పంచ్ కే మల్లారెడ్డి

ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో రిపోర్టర్ గడ్డం సుధాకర్

సమాజానికి మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నాగర్ దొడ్డి సర్పంచ్ కే మల్లారెడ్డి కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించడానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే నిదర్శనం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్ కుమార్ గారు మరియు గ్రామ వార్డు మెంబర్స్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.