- మున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన కౌన్సిలర్ పాశం అమర్ నాథ్ జంగిటి రవీందర్

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో
భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగంను పాశం అమర్, జంగిటి రవీందర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పాశం అమర్ నాథ్ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో.. జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ అధికారులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అధికారులు కూడా 18 వ వార్డు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. భువనగిరి 18 వ వార్డు కౌన్సిలర్ గా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు. ప్రజా అవసరాలు తీర్చేందుకు, అభివృద్ధి కోసం ప్రజలు అధికారులు సహకరించాలని కోరారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని 18 వ వార్డు కౌన్సిలర్ పాశం అమర్ నాథ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించేందుకు నిరంతరం పాటుపడతా అని అన్నారు. ఎటువంటి సమస్య ఎదురైనా.. ఏదైన వార్డు ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తన వార్డులో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వాటి పరిష్కారం కోసం పని చేస్తానని తెలిపారు.