prathighatana.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 11:38 am Digital Edition : PRATHI GHATANA

హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రాణానికే ప్రమాదం

మహదేవుని పేటలో కళాకారుల అవగాహన కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

బిజినపల్లి మండల పరిధిలోని మహాదేవుని పేట గ్రామంలో మంగళవారం రాత్రి కళాకారులు స్వచ్ఛందంగా రోడ్డు ప్రమాదాలపై కళాజాత నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల కళాకారులు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరగడంతో మహదేవుని పేట గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగం, గంజాయి నిషేధం, డ్రింక్ అండ్ డ్రైవ్, పై కళాజాత కార్యక్రమాన్ని ఆటపాటల ద్వారా గ్రామంలోని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ శ్రీనివాస్ హాజరై బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ముఖ్యమని, ఓవర్ డ్రింక్ చేసి వాహనాన్ని నడపరాదన్నారు. యువత గంజాయి మత్తు పదార్థాలు లాంటివి వాడరాదన్నారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు మాట్లాడుతూ.. మన గ్రామంలో ఎక్కువ యాక్సిడెంట్లు కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా యువత కోసం నిర్వహించామన్నారు. గ్రామంలోని పెద్దలు మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా కళాకారులు వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాకు అందించినందుకు కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ కుమార్, సుధాకర్ రెడ్డి,నరేందర్, జుర్రు కృష్ణ, తిరుపతి రెడ్డి, రాగ రమేష్, కళాకారులు జయప్రకాష్, విజయ్ కాంత్, నరేందర్,రాజు, కాశీదాస్, సతీష్, శ్రావణ్, శ్రీశైలం, చందు, జహంగీర్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.