ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణస్వయం సహాయక సంఘాల బాధితులకు న్యాయం చేయాలి

స్వయం సహాయక సంఘాల బాధితులకు న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్

స్వయం సహాయక సంఘాల సభ్యులకు జరుగుతున్న అన్యాయాలపై మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాధితులతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళలు పొందాల్సిన ఆర్థిక సాయం, రుణ సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం అధికారుల నిర్లక్ష్యం కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను వెంటనే అందజేసి బాధ్యులపై చట్టబరమైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాదారాజు ఉమా శంకర్ రావు, జిల్లా కార్యదర్శులు మేడి కోటేష్, వైజయంతి, కౌన్సిలర్లు వంగెటి సుచరిత, బండారు స్వర్ణలత, తుమ్మల యాస్మిన్ నగేష్, మాజీ కౌన్సిలర్లు నల్లమాస సుమ వెంకటేష్, జనగాం కవిత, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణచారి, ఉడుత భాస్కర్, మంగు నర్సింహ, పట్టణ ఉపాధ్యక్షుడు యట వెంకటేష్, కొల్లోజు సతీష్, ఇండ్ల సత్యలక్ష్మి, కొలిచిలిమ మల్లికార్జున్, కానుకుంట్ల రమేష్, ఉషా కిరణ్, దాసరి స్వామి, తాడూరి రాజ్ కుమార్, ఎరుపుల శివ, వాస నర్సింగ్ రావు, అందే విజయ్, కారుపాటి రాజు, గాయపాక పృద్వి, పట్నం కిట్టు, రావుల సంతోష్, జర్రిపోతుల భరత్, మామిడాల పవన్, కోళ్ల సుధాకర్, బండారు శివశంకర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!