prathighatana.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 3:55 pm Digital Edition : PRATHI GHATANA

సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ వంటి సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీస్ అధికారులు ముందుండాలి

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి

జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

పోలీస్ శాఖకు ప్రస్తుతం సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీస్ అధికారులు ముందుండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. సోమవారం భువనగిరి పట్టణంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ లతో కలిసి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ (లా & ఆర్డర్) మహేష్ ఎం. భగవత్ భరోసా సెంటర్‌ను ప్రారంభించారు.

అనంతరం డీజీపీ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.