prathighatana.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 1:39 pm Digital Edition : PRATHI GHATANA

సూర్ణగంటి నరసమ్మకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పలువురు నాయకులు

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

బడంగ్ పేట్ మాజీ సర్పంచ్, మాజీ కార్పొరేటర్ సూర్ణ గంటి అర్జున్ మాతృమూర్తి సూర్ణ గంటి నరసమ్మ పరమపదించిన విషయం తెలిసి, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బడంగ్ పేట్ స్మశాన వాటికకు వెళ్లి ఆమె భౌతిక దేహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. ఈ సందర్భంగా అర్జున్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ ప్రాంతానికి చెందిన పలువురు మాజీ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.