ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాజీ కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. పరాభవ నామ సంవత్సరం తెలుగు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కోరుకున్న పనులు, లక్ష్యాలు పూర్తి కావాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. వర్షాకాలంలో
పుష్కలంగా వానలు పడి రైతులకు మేలు జరగాలని కోరుకున్నారు. యువతకు, నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ ఏడాది కలిసి రావాలని లక్ష్మారెడ్డి ఆశించారు. భగవంతుడి ఆశీస్సులు మన అందరిపై, విద్యార్థులు, ఆడపడుచుల పై ఉండాలన్నారు. రాశిఫలాలు, వాతావరణం, ప్రకృతి అన్ని మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికి అనుకూలించాలని కిచ్చెన్న కోరుకున్నారు. వ్యక్తుల మధ్య ఈర్ష్య, ద్వేషాలు లేకుండా, ఐకమత్యంగా, పాజిటివ్ దృక్పథంతో ఉండాలని ప్రజలందరికీ కేఎల్ఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
