జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ చిస్తి
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
అన్ని వర్గాలకు సముచిత న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేస్ ఉర్ రెహమాన్ చిస్తి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గానికి ఎన్నికైన వారికి, నూతన కౌన్సిలర్ గా ఎన్నికైన దళిత మైనార్టీ వర్గాల ప్రతినిధులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత న్యాయం, సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో దళిత మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులకు సముచిత స్థానం ఇవ్వడం స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి దక్కుతుందని, దేశంలో విద్వేషపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతున్నారని, మతతత్వ శక్తులు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో భారత దేశంలోని ప్రజలంతా కులాలకు, మతాలకు అతీతంగా లౌకిక భావనతో పనిచేయాలన్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఎంపికైన చుక్క స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన ఎండి మజార్, జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన ఎండి అబేద్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బట్టు రాంచంద్రయ్య, బాబు రావు, హరిప్రసాద్, మజహర్, ఆబెద్, చుక్క స్వామి, షఫీక్ అహ్మద్, బబ్లు, జహంగీర్, అక్తర్ బుర్హన్, విగ్నేష్, బొంత నర్సింహా, ఈరపాక నర్సింహా, కొల్లూరి రాజు, పడిగేలా ప్రదీప్, షరీఫ్, ఇబ్రహీం, ముత్తు, రాషెద్, శంకర్, యాదగిరి, అశోక్, అతహర్, గోపి, ప్రకాష్ పాల్గొన్నారు.