ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్సమాజంలో ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకోవాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకోవాలి

📰 Generate e-Paper Clip

సమాజంలో ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకోవాలి

ప్రతిఘటన మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

సమాజంలో శాంతి, సద్భావన, వ్యక్తిగత మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి తెలిపారు. ఆదర్శ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామి 15వ సంవత్సరవార్షికోత్సవ సందర్బంగా సుదర్శన హోమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దైవ చింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తూ, దయ, కరుణ వంటి సద్గుణాలను పెంచుతుందని, తద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుబిక్షంగా ఉండాలని మరీ ముఖ్యంగా 58వ ప్రశాంతి హిల్స్ డివిజన్ వాసులు సుఖ సంతోషాలతో ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారిని వేడుకొన్నట్లు గోపాల్ రెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!