మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
భువనగిరి పురపాలక సంఘ పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి సూచించారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో పట్టణంలోని 4, 11, 16, 17, 35 వార్డులలో ఆమె ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు స్థానిక వినాయక చౌరస్తా నుండి పాత బస్టాండ్ మీదుగా వినాయక చౌరస్తా వరకు వరకు 5 కే రన్ నిర్వహించారు. వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల, స్థానిక గౌరవ వార్డు సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ హాజరయ్యారు. 35వ వార్డులో ఉన్నటువంటి పందుల సమస్యలను నివారించుటగాను సదరు పందుల పెంపకం దారులు అందరూ తమకు సంబంధించిన పందులను పట్టణం నుండి పట్టణ శివారు ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.