prathighatana.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 3:26 pm Digital Edition : PRATHI GHATANA

సత్ ప్రవర్తనతో మెలగాలని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

సత్ ప్రవర్తనతో మెలగాలని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

నేరాలకు పాల్పడాలనే ఆలోచనలు మానుకోవాలి

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే రౌడీషీటర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. పోలీస్ స్టేషన్ కార్యాలయంలో రౌడీషీటర్లకు ఇన్స్పెక్టర్ ఎస్ఐలు దయాకర్ రెడ్డి, లక్ష్మయ్య, పైసల్ ఖాన్ తో కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, వారి పై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ
ప్రస్తుతం ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్థులు నేర ప్రవృత్తిని పూర్తిగా వదిలేసి, సమాజంలో అందరితో కలిసి మెలిసి జీవించాలన్నారు, నేరాలకు పాల్పడాలనే ఆలోచనలు మానేసి, కష్టపడి గౌరవ ప్రదమైన పనులు చేసుకుంటూ మంచి నడవడికతో బ్రతకాలని, తద్వారా తమ కుటుంబాలకు సమాజంలో మంచి గుర్తింపుతో పాటుగా విలువ పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా రాబోయే జిహెచ్ఎంసి డివిజన్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా గొడవలకు, ఆందోళనలకు గానీ పాల్పడితే వారిని గుర్తించి పోలీసులు చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సై లు మాట్లాడుతూ ప్రతి రౌడీ షీటర్లకు, పాత నేరస్తులు తమ నేర ప్రవృత్తిని స్వస్తి పలికి సమాజంలో గౌరవ ప్రదంగా మెదులుతూ తమ వంతుగా కుటుంబాన్ని, పిల్లలను బాధ్యతగా చూసుకోవాలన్నారు.