ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ వేడుకలను జల్ పల్లి డివిజన్ లో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు, నేడు పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణరెడ్డి, ఎస్సైలు దయాకర్ రెడ్డి, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు చింతకింది నవీన్ గౌడ్, నవాజ్, మల్లికార్జున్ తదితరులు జల్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ కో- ఆర్డినేటర్ షేక్ జహంగీర్ కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మాత్రమే కాదు, సమాజంలో ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప సందర్భమన్నారు. అల్లాహ్ చూపే మార్గంలో నడుస్తూ, ద్వేషాలకు తావు లేకుండా ప్రేమతో అందరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఈ రంజాన్ పర్వదినం అందిస్తోందన్నారు. ఉపవాస దీక్షల ద్వారా పొందిన ఆత్మశుద్ధిని జీవితాంతం కొనసాగించాలని ఆకాంక్షించారు.