prathighatana.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 12:15 pm Digital Edition : PRATHI GHATANA

శ్రీ జ్ఞానేశ్వర వాత్సల్య మందిరానికి నీటి ప్యూరిఫైయర్ అందజేత

ప్రతిఘటన, నాగర్ కర్నూలు
బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

జిల్లా కేంద్రం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీజ్ఞానేశ్వర వాత్సల్య అరక్షిత బాలికల మందిరానికి రూ. 35 వేల విలువగల నీటి ప్యూరిఫైయర్ ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. 320A లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి నీటి ప్యూరిఫైయర్ ను ప్రారంభించారు. అరక్షిత బాలికల నీటి దాహార్తిని తీర్చుటకు ఉపయోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా శ్రీశైలం వెళ్తున్న శివ భక్తులకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు హకీమ్ విశ్వ ప్రసాద్, రాధాకృష్ణ, నరేందర్ రెడ్డి సురేష్ కుమార్, పరమేశ్వర్ రెడ్డి, ఆశ్రమ మహిళ వార్డెన్ కల్పన, విద్యార్థులు పాల్గొన్నారు.