ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు

శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

శ్రీ విశ్వవసు సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్ల పక్షం ద్వాదశి శనివారం బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహ దోష నివారణకు స్వామి వారికి తిలతైలా అభిషేకాలు భక్తితో వేద మంత్రచరణల మధ్య జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్ట మాత సమేత శనేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ.. ఈ మాసంలో స్వామి వారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు జన్మ రిత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామి వారిని శక్తి మేరకు పూజించాలని అన్నారు. ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమ శివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధన, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చన పూజలు భక్తులచే నిర్వహించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!