అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
శ్రీ రామచంద్రస్వామి, సీతమ్మ వారి ప్రతిమలను మండపానికి తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు
శ్రీ సీతారాముల కళ్యాణం మహత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి
ద్యాగదొడ్డి గ్రామంలో వెళ్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ద్యాగదొడ్డి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు జగన్మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు శ్రీ సీతారామ చంద్రస్వామి మూర్తులను వేద మంత్రోచ్ఛరణల మధ్య మేళ తాళాలతో కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ద్యాగదొడ్డి గ్రామ పెద్దలు జగన్మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు సీతమ్మ వారి తరఫున, కృష్ణ కుమార్ రెడ్డి, స్వాతి దంపతులు శ్రీరాముని తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా కళ్యాణం నిర్వహించారు. మాజీ సర్పంచ్ బండ్ల బసిరెడ్డి, మహేశ్వరి దంపతులు, ఉప సర్పంచ్ గడ్డం గోపాల్, రజిని దంపతులు శ్రీ సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. దీంతో శ్రీరామనవమి వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.

ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు ఉప్పరి కిష్టప్ప, పెద్ద సవరన్న, వెంకటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జయన్న, చిన్న సవరన్న, గ్రామ యువకులు మహానంద రెడ్డి, గడ్డం జనార్ధన్, గడ్డం పరుశురాం, గడ్డం సుధాకర్, తిమ్మారెడ్డి, ట్రాక్టర్ పరుశురాం, నరేష్, నవీన్, నరేష్ శెట్టి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాత్రి మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు డీజే మోతల మధ్య జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి పల్లకి ఊరేగింపు సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఊరేగింపులో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

