ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్వైద్య కళాశాల విద్యార్థులచే క్షయ వ్యాధి అవగాహన ర్యాలీ

వైద్య కళాశాల విద్యార్థులచే క్షయ వ్యాధి అవగాహన ర్యాలీ

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నాగర్ కర్నూల్ వైద్య కళాశాల – 2024 సంవత్సర విద్యార్థులచే క్షయ వ్యాధి అవగాహన ర్యాలీని వైద్యాధికారి డాక్టర్ పి.సృజన ప్రారంభించారు. సమాజంలో క్షయ వ్యాధిని త్వరగా గుర్తిస్తే, చికిత్సతో పాటు నిర్మూలన సాధ్యమవుతుంది అని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన రోడ్డు వెంబడి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీబీ ముక్త్ భారత్ వారి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నరేష్, మెడికో సోషల్ వర్కర్ డి.బాలమ్మ, హెల్త్ సూపర్ వైజర్ అశోక్ కుమార్, చంద్రశేఖర్, క్షయ వ్యాధి సూపర్ వైజర్ శ్రీనివాసులు, ఆరిఫ్, శ్రావణ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కే.మంగ, శ్వేత, ఆశా కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!