prathighatana.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 1:16 pm Digital Edition : PRATHI GHATANA

వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికుల పని వేళల్లో మార్పులు చేయండి

గ్రేటర్ కమిషనర్ ఆర్.వి కర్ణన్ కు వినతి పత్రం అందజేసిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్, నాయకులు

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో ప్రతినిధి

జీహెచ్ఎంసీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వేసవికాలం ఎండ తీవ్రత పెరిగిన సందర్భంగా పని గంటలలో మార్పు చేసి ఎండలు తీవ్రం కాక ముందే పని ముగించుకొని ఇంటికి వెళ్లే విధంగా పని సమయంలో మార్పు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కు సీఐటీయూ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఉదయమే ఆరు గంటలకు పని ప్రారంభించి హైదరాబాద్ నగర రోడ్లు ఊడుస్తూ శుభ్రంగా ఉంచుతూ నగర ప్రజలకు అనారోగ్యాలు రాకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తారని తెలిపారు. వాళ్ళ శ్రమను వెలకట్ట లేనిదని, వాళ్లు చాలీ చాలని వేతనంతో పని చేస్తున్న కనీసం వారికి వింటర్ సీజన్ వాతావరణ మార్పులు వచ్చినప్పుడల్లా వారి పని చేసే సమయంలో మార్పులు చేసే విధంగా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని అదే విధంగా ఇప్పుడు ఎండలు తీవ్రంగా అవుతున్న సందర్భంగా ఎండకు పని చేయడంతో వారి గ్లూకోస్ లెవల్ పడిపోయి నీరసించిపోయి పని చేయలేని స్థితిలో ఉంటారు కాబట్టి, వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రత కారణంగా ఉదయం 5:30 కి పనిలో చేర్చుకొని మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పని ముగించి ఇంటికి పంపే విధంగా అధికారులు కృషి చేసి వాళ్లకు వెసులుబాటు కల్పించే విధంగా చేయాలని అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. ఇందుకు అడిషనల్ కమిషనర్ ఎన్. రవి కిరణ్ సానుకూలంగా స్పందించి ఎండల తీవ్రతను బట్టి సమయంలో మార్పులు చేసి ఎండ తీవ్రత కాకముందే వారి పని ముగించే విధంగా కృషి చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం.దశరథ్, నగర ఉపాధ్యక్షులు జి.రాములు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అంజయ్య, సుబ్బారావు, సీహెచ్. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.