వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
రానున్న వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం మినీ మీటింగ్ హల్ లో జిల్లాలో మంచి నీటి సరఫరా పై ఆర్ డబ్ల్యుయస్, మిషన్ భగీరథ, హెచ్ యం డబ్ల్యూ ఎస్, ఎస్ ఈ పబ్లిక్ హెల్త్ సంబంధిత శాఖల అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ.. మల్లన్న సాగర్ నుండి ఘన్ పూర్ వరకు 210 కోట్ల తో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను కోరారు. నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. నీటి ఎద్దడి నెలకొనేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిచ లన్నారు.వేసవి సీజన్లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే, తక్షణమే స్పందించి చర్యలు చేపట్టేవిధంగా అధికారులను, క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్.ఈ కృష్ణయ్య, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకరన్, యస్. ఈ పబ్లిక్ హెల్త్ వెంకటేశ్వర్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ డీజీఎం శశాంక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
