ఉపాధి కార్మికులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
చేసిన పనికి కార్మికులకు పే స్లిప్ లు ఇవ్వాలి.
పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల, పేదల పోట్ట గోట్టడానికి తీసుకువచ్చిన విబి – జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఇప్పటికైనా ఉపాధి హామీ కార్మికులు పనిచేసిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.
శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికుల పని ప్రదేశాన్ని జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్యతో కలిసి సందర్శించడం జరిగింది. అనంతరం వారి సమస్యలను తెలుసుకున్న తర్వాత వారిని ఉద్దేశించి నర్సింహ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు రెండు పూటల బువ్వ పెడుతు, ఆర్థికంగా ఉపయోగపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. అధికారం చేపట్టిన ఈ 11 సంవత్సరాల నుండి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఉపాధి హామీ కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు. పని ప్రదేశాల్లో తాగడానికి నీళ్లు ఇవ్వకుండా, నిలువ నీడ లేకుండా, వారం వారం చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా, పనిచేస్తున్నప్పుడు ఫోటోలు దిగి పెట్టాలని వేధించారని వేధిస్తున్నారని అన్నారు. ఇప్పుడేమో అసలు ఉపాధి హామీ చట్టం లేకుండా జి రామ్ జి చట్టం తెచ్చి ఉపాధి హామీ కార్మికుల హక్కులను కూడా కాలరాసారని అన్నారు. 100% నిధులనుండి కేంద్రం తప్పుకొని రాష్ట్రా ప్రభుత్వాలు కూడా 40 శాతం నిధులు ఖర్చు చేయాలని పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ఈ కుట్రలను కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలని నర్సింహ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, చీమలకొండూరు సర్పంచ్ పల్లెర్ల అంజయ్య మాట్లాడుతూ నాలుగు నెలలకు పైగా కార్మికులకు చేసిన పనికి డబ్బులు చెల్లించకపోతే కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాబు కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు నూతన జాబు కార్డులు ఇవ్వడం లేదని అన్నారు. అనేకమంది పని లేక జాబు కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, నూతన జాబు కార్డులు ఇవ్వాలని, జి రామ్ జి చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా పాత చట్టాన్ని అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రామస్వామి, ఉపాధి కూలీలు బోమ్మారపు లావణ్య, శిరిష , లక్ష్మి, స్వాతి, సంగీత, ధనలక్ష్మి, క్రిష్ణ, రాంపల్లి శ్రీలత, లావణ్య,మమత, పల్లెపాటి శోభారాణి, లక్ష్మి, ర్యాకల లావణ్య, వరిగంటి రమాదేవి, లక్ష్మి, లావణ్య, గుండ్లపల్లి జ్యోతి, బీటుకూరు నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.