ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరివీధి కుక్కల బారి నుండి ప్రజలను ప్రాణాలను కాపాడండి

వీధి కుక్కల బారి నుండి ప్రజలను ప్రాణాలను కాపాడండి

📰 Generate e-Paper Clip

సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

వీధి కుక్కల బారి నుండి ప్రజలను ప్రాణాలను కాపాడాలని సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య లు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో వీధి కుక్కలు, కోతులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు పట్టణ ప్రజలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కుక్కలు, కోతుల నివారణకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు వచ్చిన నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయబ్రాంతులకు గురిచేస్తున్న కుక్కలు, కోతుల బారి నుండి పట్టణ ప్రజల ప్రాణాలను కాపాడాలని మున్సిపల్ అధికారులను వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!