prathighatana.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 12:43 am Digital Edition : PRATHI GHATANA

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

 

ప్రతిఘటన, జోగులాంబ గద్వాల రిపోర్టర్ గడ్డం సుధాకర్

రైతులు తమకు అవసరమైన యూరియాను నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాపు ద్వారా బుకింగ్ చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ రైతులకు సూచించారు. జిల్లా అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక వినియోగదారులు నిబంధనల ప్రకారం గ్యాస్ బుక్ చేసుకుంటే ప్రతిరోజు పద్ధతి ప్రకారం డెలివరీ చేయడం జరుగుతుందని అన్నారు. కేజీబీవీ లలో మెనూ ప్రకారం వంట గ్యాస్ డెలివరీ చేయకుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం ఐజ పీ.హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్య సిబ్బంది, అటెండర్లు రిజిస్టర్ లో, సెలవు పెట్టకుండా గైర్హాజరు కావడం, సంతకం పెట్టి విధులు నిర్వహించకుండా వెళ్లిపోవడం వంటి పలు కారణాలతో 9 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సంధ్య కిరణ్మయిని ఆదేశించారు. అదే విధంగా ఒకరిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓపి రిజిస్ట్రేషన్ లు పరిశీలించి ప్రతిరోజు సుమారు వందకు పైగా రోగులు చికిత్స నిమిత్తం వస్తున్నందున వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎర్లీ డేట్ అఫ్ డెలివరీ తదితర రిజిస్ట్రేషన్ లు పరిశీలించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అక్కడి వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రి వార్డులు, ఇతర భవనాలలో అపరిశుభ్రత, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా ఆసుపత్రి ని పరిశుభ్రంగా మార్చాలని ఆదేశించారు. అనంతరం ఐజా పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా సందర్శించారు. స్టాక్ రిజిస్ట్రేషన్ ను, ధరల పట్టికను పరిశీలించారు. రైతులు తమకు కావాల్సిన ఎరువులను నూతనంగా వచ్చిన యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానంపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. రైతు భరోసా దరఖాస్తు కు ఈ నెల 25న చివరి తేదీ కాబట్టి అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు సహకరించాలన్నారు. ఈనెల 22న ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడుతున్నందున రైతు వేదిక వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఐజా లోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. నిర్ణీత గడువులోగా గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వారికి ఓటీపీ నెంబర్ వస్తుందని, నిబంధనలు పాటించకుండా బుక్ చేసుకుంటే ఉపయోగం లేదని, అందుకు గల కారణాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రతిరోజు బుకింగ్, డెలివరీ తదితర అంశాల గురించి కలెక్టర్ మాట్లాడారు. వినియోగదారులు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద బారులు తీరకుండా వారికి అవసరమైన సమయాన్ని తెలియజేసేందుకు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి స్వామి కుమారును ఆదేశించారు.

చివరగా ఐజ లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ వంటగదిలో వండిన పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు వంటలు చేయకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. మరమ్మత్తుల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యాలయం అభివృద్ధికి అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందజేస్తున్న ఆహారం ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు తన దృష్టికి తీసుకురావాలని తప్పకుండా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.