ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచాలి

వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచాలి

📰 Generate e-Paper Clip

బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి ఐదు శాతం నిధులు కేటాయించాలి

ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా

జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతిఘటన బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్

వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి ఐదు శాతం నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్ లు డిమాండ్ చేశారు. బుధవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగుల పెన్షన్ 6 వేలు ఇస్తామని రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు పెన్షన్ గురించి ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వికలాంగుల పరిరక్షణ చట్టం 2016 అమలు చేసి వికలాంగులకు సంక్షేమ పథకాలలో రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలన్నారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని యధావిధిగా ఉంచాలని విబీ జీ రామ్ జీ స్కీమును రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులకు అందిస్తున్న సహాయ పరికరాల యందు నోటరీ అఫిడవిట్ రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, ఉపాధ్యక్షులు శ్యాంసుందర్, జిల్లా నాయకులు కీసర వెంకటరెడ్డి, గొడుగు దాసు, నాగు, నరసింహ, పున్న శ్రీధర్, శివగల రాములు, ఏషాల గోపి, పర్వతం సాలమ్మ, గర్దాసు సత్తయ్య, యాట చందు, హరిబాబు, మంచాల జనార్ధన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!