కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
వార్డ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని 13 వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ అన్నారు. సోమవారం వార్డ్ లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ తో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీవాణి మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం తో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.డీ మజర్ పాషా, నరేష్, సభర్ కార్ వెంకటేష్, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.
