ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవామనపల్లి గ్రామంలో నూతన బోరు మోటర్

వామనపల్లి గ్రామంలో నూతన బోరు మోటర్

📰 Generate e-Paper Clip

ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఫర్నిక కృపాకర్ రెడ్డి

ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా రిపోర్టర్ గడ్డం సుధాకర్

వామనపల్లె గ్రామంలో త్రాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన నూతన బోర్ మోటర్ కు గురువారం గ్రామ సర్పంచ్ ఫర్నిక కృపాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పండ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలా జీవితంలోని కష్ట సుఖాలను, సవాళ్లను ఆశావాదా దృకృథంతో స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి శ్రేయస్సు ఆరోగ్యం ఆనందాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు డీ నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ శిరీష రాజు, వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!