prathighatana.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 2:28 pm Digital Edition : PRATHI GHATANA

వయోవృద్ధుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంప్

సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్

ప్రతిఘటన, ఎల్బీనగర్

వయోవృద్ధుల కోసం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, శాతహన నగర్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్యర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపును నిర్వహించారు. కంటి, డెంటల్ డాక్టర్లతోపాటు జనరల్ పిజిషియన్ డాక్టర్లతో క్యాంపును నిర్వహించారు. మెడికల్ క్యాంపుననకు వృద్ధులు, మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారికి కావాల్సిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు దొబ్బ నాగమల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వృయోద్ధులకు నిత్యం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. రోజువారీగా మందులు వేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. అసోసియేషన్ ఆధ్యర్యంలో వారికి ఆరోగ్య పరీక్షలు చేయించి, వారికి ఉచితంగా మందులు కూడా ఇస్తామన్నారు. మెడికల్ క్యాంపులను రెగ్యులర్ నిర్వహించే ఆలోచన చేస్తున్నామన్నారు. నైటింగల్ ఆస్పత్రి జనరల్ పిజిషియన్ డాక్టర్ హరీష్ కుమార్, బాలాజీ డెంటల్ క్లినిక్ డాక్టర్ నవీన్రెడ్డి, కంటి డాక్టర్ నాగభూషణం, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ మురళీరెడ్డి, కోశాధికారి రాజశేఖర్, నాయకులు సతీష్ గౌడ్, రాఘవులు, తిరుపతిరావు, ప్రతాప్రోవు, జగదీశ్వర్ రెడ్డి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.