prathighatana.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 4:02 pm Digital Edition : PRATHI GHATANA

వట్టెంలో డిపెప్ మిత్రుల రజతోత్సవ ఆత్మీయ సమ్మేళనం

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

జిల్లా ప్రాథమిక విద్యా పథకం క్రింద విజయవంతంగా పనిచేసి విద్యా లక్ష్యాలను సాధించడంలో విశేష కృషి చేసిన రిసోర్స్ పర్సన్స్ గ్రూప్ 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వట్టెం గుట్టపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి సమక్షంలో ఉమ్మడి జిల్లాకు చెందిన సుమారు 100 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా అప్పటి అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్ సందడి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పాల్గొన్న మిత్రులు ఆయా జిల్లాలలో తాము చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ విద్యా రంగంలో ముఖ్యంగా పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల పాత్రపై వారు చేసిన పరిశోధనాత్మక అంశాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పటి నాలుగు జిల్లాల శిక్షణ ఇంచార్జ్ గా వ్యవహరించిన గాడి సురేందర్ అధ్యక్షులుగా వ్యవహరించారు. నాగర్ కర్నూలుకు చెందిన బి. వేణుగోపాల్, అడ్డాకులకు చెందిన శివకుమార్, వనపర్తికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్, పెద్ద మందడికి చెందిన వరప్రసాద్, రమాకాంత్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.