ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
లేమూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా మొహమ్మద్ రహీమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన గ్రామ కమిటీ నాయకులు , సభ్యులు, పార్టీ కార్యకర్తలు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. మాజీ సర్పంచ్ గూడూరు కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ మూల హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న లేమూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ రహీమ్ ని, కమిటీ సభ్యులు గ్రామ జనరల్ సెక్రటరీ మంచాల భాస్కర్, గ్రామ యూత్ అధ్యక్షులు మంచాల రాజేష్, వైస్ ప్రెసిడెంట్ గుర్రం సత్తయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు డప్పు పోషయ్య బిసి సెల్ అధ్యక్షుడు సూరంపల్లి రమేష్, సెక్రటరీ గూడూరు మధుకర్ రెడ్డి, గుల్వి దేవేందర్, సలహాదారులుగా మూల ఇంద్రారెడ్డి, గ్యారల వీరేష్, ఎలుక సుధాకర్ రెడ్డి, అఖిల్ అహ్మద్, కడ్తల రత్నం,మంచాల లక్ష్మయ్య, చిన్నగాళ్ల కృష్ణ, గుల్వి దర్శన్, మహమ్మద్ బాబ. మహమ్మద్ సోహైల్ తదితరులు కమిటీ సభ్యులను నియోజకవర్గం ఇంచార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి సన్మానించి ప్రశంసించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. నిరంతరం పేదల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం గా పని చేయాలని కేఎల్ఆర్ సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని, ప్రతి పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో టిపిసిసి జనరల్ సెక్రటరీ మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సభవత్ కృష్ణ నాయక్ ప్రచార కమిటీ మాజీ సభ్యులు సరికొండ మల్లేష్, ఇంజమూరి రామచంద్ర రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, వార్డ్ మెంబర్ కాషాంశెట్టి శేఖర్,9 కాషాంశెట్టి కిషన్ ఎడ్ల సత్తయ్య
గంగరి శ్రీను, చింతకింది కృష్ణ,కాశంశెట్టి బలవంత్ రావు,ఎర్ర రమేష్ డప్పు కరుణాకర్, బన్నీ, ఎండి బాబా, సోహైల్, కత్తుల సురేష్ పాల్గొన్నారు.